తెలంగాణ ఉద్యమం మరోమారు ఉదృతం అవడం వల్ల లెక్కలేనన్ని వాదనలు తెరపైకి వచ్చాయి. అసలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రము అవసరమా, తెలంగాణే ఆంధ్రకంటే అభివృద్ధి చెందిందని, రాయల తెలంగాణ ఏర్పాటు అయితే బాగుంటుందని.... ఇలా రకరకాల వాదనలు, అభిప్రాయాలూ వినిపిస్తున్నాయీ. ఇందులో ఏది నిజం, ఏం జరిగితే బాగుంటుందని అలోచిస్తీ.....
తెలంగాణ దశాబ్దాలుగా వెనకబాటుకు, అన్యాయానికి గురైందని వై, ఎస్ నుంచి సమక్యంధ్ర అంటూ సంకలు గుడ్డుకుంటున్న చిరంజీవి వరకు ప్రతి ఒక్కరు ఒప్పుకున్నా మాట వాస్తవం. ఇది అందరికి తెలిసిన మాటే. కానీ అసలు సమయానికి వస్తే వేరే వాదనలు వినిపిస్తున్నారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టినట్టు సంధర్బం బట్టి ........ ఇదే నేతలు తెలంగాణ ఆంధ్రకంటే అభివృద్ధి చెందిందని చెబుతున్నారు. వీరు చెప్పే మాటల్లోనే స్పష్టత వుండదు. వారికీ స్పష్టత కొరవడి కాదు.......... తెలంగాణ అభివృద్దిపై చిత్తశుద్ధి కొరవడి, ఆంధ్రపై వల్లమాలిన అభిమానంతోనే నాలుకలను తాటి మట్టల్లా తిప్పుతున్నారు.
No comments:
Post a Comment