My friend

Sunday, August 14, 2011

భిన్న ధ్రువాలు కలవాలి.

ఫోటో; స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా మిఠాయిలు ఇచ్చి పుచ్చుకుంటున్న సైనికులు

Wednesday, February 23, 2011

ఎటువైపు ఈ పయనం....?


తెలంగాణ పోరుకు నాలుగు దశాబ్దాలు దాటుతుంది. పదేళ్లుగా ఉదృతంగా సాగుతుంది. ఈవిడత ప్రత్యేక రాష్ట్రం ప్రకటన వరకు పోయి.... వెనక్కి వచ్చినం. కృష్ణ కమిటికి సంవత్సరం దాటింది. నివేదిక వచ్చి కూడా నెలలు దాటుతుంది. ఇంకా నాటకాలు సాగుతూనే ఉన్నాయి. వీటికి అంతం కోసం నాలుగు కోట్ల జనాలు ఎదురు చూస్తండ్రు. నలబై ఎనిమిది గంటల బందుకు పిలుపునిచ్చినా జనాలు మద్దతు ఇచ్చిండ్రు అంటే ఎంతటి ప్రగాడ కోరిక ఉందొ అర్థం అయితంది. ఓ దిక్కు విద్యార్థులు, లాయర్లు, ఉద్యోగులు పని పక్కకు పెట్టి పోరుబాట పట్టిండ్రు. అయినా.... 125 ఏండ్ల కాంగ్రేసుకు దున్నపోతు మీద వాన పడ్డట్లే ఉంది. అధిష్టానాన్ని మెడలు వంచలేక బిక్కచచ్చిన మన నాయకులు డిల్లీ నుంచి ఎట్లా ఆడిస్తే అట్లనే ఆడుతుండ్రు. సోనియమ్మకి మన బాధలు అర్థంకాక ఇట్లా చేస్తాంది అనుకోను. తెలిసినా తెల్వనట్లు ఏమి జరగనట్లు నటిస్తంది. వాళ్లకు కావాల్సింది..... ఎటొచ్చి రాష్ట్రంల మల్లీ గెలవాలి మన బలంతోని 2014 ఎన్నికల్ల గెలవాలే. ఆ రాహుల్ నో ఇంకోక్కరినో ప్రదానిని చేసుకోవాలె. గది చూడాలంటే..... గీ సమస్యను అంతవరకు సాగతీయాలే. ఇప్పటికే చిరంజీవిని కలుపుకుని చంద్రబాబుకు, జగన్ కు చెక్ పెట్టిన కాంగ్రెస్.... ఇప్పుడు తెలంగాణల పట్టుకోసం పాకులాడుతంది. ఇప్పుడు ఇలాగే రాష్ట్రము ఇస్తే క్రెడిట్ కేసీఆర్ కు పోతది. ఈ భయాన్ని ఆ పార్టి ఎంపీలే భాహాటంగా భయట పెట్టిండ్రు. ఇందుకే ఎంత గొడవ జరుగుతున్నా డిల్లికి సెగ తాకుతున్నా పట్టి పట్టనట్టు నటిస్తాండ్రు. రాష్ట్రంలో అగ్గిపుడుతున్నా చూసి చూడనట్టు చేస్తాండ్రు.

ఒక్కటి ఖాయం. ఇంత పోరాటం జరిగినంకా ఇంకా కలసి ఉండుడు కుదరని పని. ఇది అందరికి అర్థం అయింది. సీమంధ్ర నేతలు కూడా ఒప్పుకున్తండ్రు. మరి ఇక్కన్నే ఉంది ప్రమాదం. 2014 వరకు టీఆర్ఎస్ ను కలుపు కోవాలని కాంగ్రెస్ చూస్తాంది. ఒత్తిడి తీసుకు వస్తుంది. అటు సీమంద్ర నేతలు హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసేందుకు కుట్రలు చేస్తాండ్రు. ఇక్కడి జనం ఒప్పుకోరని తెలిసి వాళ్ళను అనుగతొక్కే ప్రయత్నం చేస్తాండ్రు. ఎలక్షన్ల వరకు ఎట్లనో ఒకట్ల కెసిఆర్ ను ఒప్పిచ్చి హైదరాబాద్ లేని తెలంగాణ ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు కనబడ్తుంది. ఇందులో భాగంగానే ఎంపీలతోని మాట్లాడిస్తండ్రు.... టీ ఆర్ ఎస్ ను కాంగ్రెస్ లో కలపాలనే ప్రతిపాదన చేయిస్తాండ్రు.
బిక్షం అడుక్కోవడం లేదు: తెలంగాణ ప్రజలు రాజ్యంగంల ఉన్న హక్కు ప్రకారమే ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతున్నారు. దాని వెనక ఉన్న కారణాలు కూడా అందరికి తెలుసు. కానీ కాంగ్రెస్ నాయకులు ఇతి సుతి లేని మాటలు మాట్లాడుతున్నారు. చంద్రశేకర్ పార్టీని కాంగ్రేస్స్ లో కలిపితే వెంటనే రాష్ట్రం వస్తుంది అని చెప్తుండ్రు. అది వాళ్ళంతట వాళ్ళు చెబుతున్నది కూడా కాదు. సోనియమ్మ చెప్పిస్తున్న మాటలే. పార్టీల విలీనానికి రాష్ట్రానికి సంబంధం లేదు. కానీ వారి ప్రయోజనాలు నెరవేరాలంటే, మల్లీ అధికారం రావాలంటే, రాహుల్ ప్రదాని కావాలంటే వాళ్ళు చెప్పింది జరగాలి. మూర్ఖుల ద్రుష్టిలో ప్రజలు భిక్షం అడుక్కుంటూ ఉన్నట్టు కనిపిస్తూ ఉండొచ్చు. కానీ ప్రజలు వారి జన్మ హక్కు కోసం పోరాడుతుండ్రు. పార్టీ అంటే కార్పోరేట్ కంపెనీ అనుకునే..... పార్టీలను కంపనీల్లాగా మార్చిన నిక్రుస్టులు అంతకన్నా ఎక్కువ ఆలోచించలేరు.


పరిస్తితి మారాలంటే తెలంగాణలోని నాయకులూ అంతా ఏకం కావాలి. దురదృష్టం ఏమిటంటే ప్రజలంతా ఎకమైండ్రు.... కానీ సొంత లాభం తప్ప మరో గోడు పట్టని నేతలు మాత్రం కలవడం లేదు.

ధన్యవాదాలు: ఉద్యమంలో లెక్కలేనన్ని లాఠి దెబ్బలు తింటున్న విద్యార్థులు, లాయర్లు, ఉద్యోగాన్ని లెక్క చేయకుండా సహాయ నిరాకరణ చేస్తున్న ఉద్యోగులు, కళాకారులు, ఉద్యమంలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.


ను

Sunday, February 20, 2011

మరోసారి మన విద్యార్ధి సైన్యం అసెంబ్లీ ముట్టడికి సిద్దం అవుతుంది. ప్రోగ్రాం సక్సెస్ కావాలని ఆశిస్తూ..... జై తెలంగాణ.
వాతలు పెట్టగానే నక్క పులి కాదు
సూక్తులు చెప్పగానే మనిషి మేధావి కాడు
రాష్ట్రం కోరే ప్రతివాడు దేశ ద్రోహి కాడు
నీకు మనసుంటే తెలంగాణ గుండె చప్పుళ్ళు వినవయ్య జే.పీ!

(
నేలను పాలించుకునే సత్తా ఇక్కడి వాళ్లకు లేదని చెప్పిన జే.పీ గారికి ప్రేమతో.....)

Saturday, February 12, 2011

ప్రేమ - స్నేహం - ఆకర్షణ


ప్రేమ.... ఓ మధురానుభూతి. మనసుకు తప్ప ఊహకు అందనిది. ప్రేమ గురుంచి ఎవరినడిగినా దాదాపుగా వచ్చే సమాదానం ఇదే. కానీ ప్రేమకు స్టాండర్డ్ నిర్వచనం అంటూ ఏమీ లేదు. ఎవరు ఎలా నిర్వచించుకుంటే అదే ప్రేమ. కానీ దానికంటూ ఓ లక్షణం ఉంటుంది. ఓ తల్లికి బిడ్డకి ఉండే అనుబంధం, ఓ అన్నకి చెల్లికి ఉండే అనురాగం, ఓ ఇద్దరు మిత్రులకు మధ్య ఉండే అవినాభావ సంబంధాల మధ్య ఈ ప్రేమ చిగురిస్తుంది. ఒకరి పై ఒకరికి ఉండే అనురాగం, ఆప్యాయతనే ఒకరకంగా ప్రేమ అని చెప్పవచ్చేమో. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక ఆత్మీయ సంబంధం. రెండు మనసులకు సంబంధించిందే తప్ప బౌతిక పరమైనది ఎంత మాత్రం కాదు అనే విషయం సుస్పష్టం.

ఇంతకి ప్రేమ గురంచి నిర్వచనాలు అవసరమా? అనే సందేహం రావచ్చు. ఇది సహజమే. నిజానికి ఏ సంబందానికీ నిర్వచనం అవసరం లేదు. కానీ ఈ సంబంధం ఎలా ఉంటుంది అని ప్రశ్నించుకున్నప్పుడు దానికంటూ నిర్దిష్ట లక్షణాలను గుర్తించాల్సి వస్తుంది. ప్రస్తుతం ఈ చర్చ అంతా ఎందుకంటే..... ప్రేమకి నానా అర్థాలు చెప్పుకుంటున్న పరిస్థితి నేడు కనిపిస్తుంది. పేరెంట్స్ ప్రేమ వేరు, యువతీ యువకుల ప్రేమ వేరు అనే వాదన వినిపిస్తుంది. యువతీ యువకుల మధ్య ప్రేమ అంటే అది ఒక ప్రత్యేక సంబంధం అనే అర్థంలో చెప్పుకుంటున్నారు. వారూ అలాగే వ్యవహరిస్తున్నారు. సమాజంలో ప్రేమ అంటే నేరంగా పరిగనిస్తున్న సందర్భాలూ ఉన్నాయీ. ఇంతకి ఇదంతా ఎందుకు మొదలయింది.... అని ఆలోచిస్తే ఏది ప్రేమ అనే విషయంపై స్పష్టత లేకపోవడం వల్లే.

ప్రేమ ఎక్కడైనా ఒకే రకంగా ఉంటుంది. తల్లి బిడ్డల మధ్య , స్నేహితులకు మధ్య.... విశ్వంలో ఎక్కడ ఉన్నా దానికంటూ ఓ స్వభావం ఉంటుంది. కానీ తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, రక్త సంబంధికుల ప్రేమ, స్నేహితుల ప్రేమ, స్త్రీ, పురుషుల ప్రేమ అంటూ దానికి వర్గీకరణలు ఏమీ ఉండవు. ఈ విషయం పై స్పష్టత ఉంటే ఇప్పుడు సమాజంలో ఉన్న అపోహలు, సమస్యలు ఉండవు. ప్రస్తుతం ఉన్న గొడవ అంతా యువతీ యువకుల మధ్య ప్రేమ గురించే. అసలు ప్రేమికులం అని చెప్పుకునే వారంతా నిజమైన ప్రేమికులేనా...? వారి మధ్య ఉన్న ప్రేమలో ఎంతవరకు వాస్తవం ఉంది అనే విషయం గమనించాల్సి ఉంటుంది. సహజంగా ఒక వ్యక్తిపై ప్రేమ ఉంటే... ఎల్లప్పుడు వారి క్షేమమే కోరుకుంటుంది. స్వార్థానికి చోటే లేదు. ఎంత దూరంలో ఉన్నా వారి మనసులు దగ్గరగానే ఉంటాయి. ప్రదాన విషయం ఏమిటంటే.... ఒకరిని ఒకరు ప్రేమిస్తున్నాను అని చెప్పాల్సిన అవసరమే రాదు. తల్లి బిడ్డల మధ్య, స్నేహితుల మధ్య సంబంధమే ఇందుకు నిదర్శనం.
నేటి తరం ప్రేమికులుగా చెప్పుకునే యువతీ యువకుల మధ్య ఉంటున్న సంబంధం ఏమిటి. ఒక్క క్షణం దూరమైనా ఫోన్ చెయ్యాల్సిందే. అసలు రోజులో సగానికి పైగా ఫోన్తోనే గడిపేయడం వారి మనస్థితికి అర్థం పడుతుంది. ఇక బైక్ పై షికార్లు చేయడం, సినిమాలు, పార్కులు... ముద్దులు, హద్దులు దాటడమే వారి దృష్టిలో ప్రేమంటే. తల్లి తండ్రుల కంట పడకుండా తిరగడం ... అసలు వారిది నిజమైన ప్రేమ కాదనడానికి వారి చర్యలే నిదర్శనంగ చెప్పొచ్చు. అలాగని గుడ్డిగా విమర్శించడం కాదు కానీ... వారిలో ఎంత మంది ఆకర్షణ మైకం నుంచి భయట పడ్డారో చెప్పమంటే అప్పుడు తెలుస్తుంది. ఆకర్షణకు, ప్రేమకు మధ్య భేదం తెలవక పోవడమే గందరగోలానికి దారి తీస్తుంది. ఏది స్నేహమో, ఏది ఆకర్షనో తెలియని దుస్థితిలో కొట్టుమిట్టాడుతూ ఆకర్షననే ప్రేమగా భ్రమిస్తుంటారు. మీడియా, సినిమాలోనూ అలాంటి దృశ్యాలే చూపించడంతో యీ తీరు విస్తరించింది.
లవ్ ఎట్ ఫాస్ట్ సైట్..... వినడానికి అమృతంలా ఉంటుంది. ఈ వెర్రి పదాలనే పట్టుకుని ఎందఱో పక్కదారి పడుతున్నారు. మొదటి చూపులో ఉండే ఆకర్షననే ప్రేమగా భావించి వెంటపడి తిరగడం , అమ్మాయిలు కాదన్నా ఏడిపించడం మామూలైపాయింది. ఆకర్షణ ఉన్నంత మాత్రాన తర్వాత ప్రేమగా మారదు అని చెప్పలేము కానీ ఆ ఆకర్షణ మైకం నుంచి భయట పడితేనే అది సాధ్యం అవుతుంది. మొదట పరిచయం... క్రమంగా స్నేహం. ఇద్దరి ఆలోచనలు, భావాలు దగ్గర ఉంటే ప్రాణ స్నేహం... అక్కన్నుంచి ప్రేమగా మారే అవకాశం ఉంటుంది. ఇవేవి లేకుండా ప్రేమ అంటే అది గుడ్డిదే అవుతుంది.
నా మనసును నీకే అంకితం చేసాను మరొకరిని ప్రేమించడం సాధ్యం కాదు.... చాలా సినిమాల్లో చూసిన. అందరిని ఆకట్టుకునే డైలాగ్ ఇది. వాస్తవాన్ని పక్కన పెడితే అలాగే ఉంటుంది. మనసు అనేది ఆలోచన తో ముడిపడిన, మెదడుతో అనుసందానమైన ప్రక్రియ. మన మనసు ఎన్ని ఆలోచనలైన చేయ గలదు. అది మన ఆధీనం లోనే, మనదగ్గరే ఉంటుంది. ఆలోచన తీరును భట్టే మనసు ఉంటుంది. ఈ విషయం గుర్తించక పోవడం కూడా గందరగోలానికి దారి తీస్తుంది. మరో విషయం ఏమిటంటే. .. డైలాగులను పట్టుకుని వేలాడే వారు తాము తల్లి దండ్రులను,
కూడా ప్రేమించడం లేదా అని ప్రశ్నించుకోవాలి. అమ్మాయిని లేదా అబ్బాయిని ప్రేమిస్తున్నప్పుడు మరొకరిని ప్రేమించడానికి అవకాశం లేదని చెప్పడం లో అర్థం ఏముంటుంది. అయినా వారి మనసు అంతా ఇరుకుగా ఉంటుందా. తాము ప్రేమించే కుంటుంబ సభ్యులను వదిలి ఉండే వారు ప్రేమించిన వారిగా చెప్పుకునే వారిని వదిలి ఎందుకు ఉండలేరు. వారిది నిజమైన ప్రేమే అయితే లేని పోనీ అపోహలు ఎందుకు.
చివరగా చెప్పేది ఏమిటంటే ప్రేమ అనేది మనసుకు సమబందిచిందే అని ఏకిభవించే వారు ... ప్రేమలో రకాలు ఉండవనే విషయం గుర్తించాలి. ఎవరిని ప్రేమించిన ఒకేరకంగా ఉంటుంది. ఆకర్షణ, స్నేహం, ప్రేమ, ఆప్యాయత మద్య ఉండే క్రమానుగత భేదాల్ని గుర్తించాలి. ప్రేమ విశ్వ వ్యాప్తం. విశాలమైన మనసు ఉండాలే గాని ప్రపంచం మొత్తాన్ని ప్రేమించొచ్చు. అందరి ప్రేమ పొందవచ్చు. కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటూ ముందుకు సాగొచ్చు.



Thursday, February 3, 2011

మార్పు సాధ్యమే

అవినీతి, కుళ్ళిన రాజకీయాలు, ఎన్నికల్లో ధనప్రవాహం.... ఇలా చెప్పుకుంటూ పోతే సమాజాన్ని పీడిస్తున్న సమస్యలెన్నో. ఒక్కోసారి వీటన్నిటిని కడిగి పారెయ్యాలి అని అనిపిస్తున్నది. ఏదో ఒక సందర్బంలో ప్రతి ఒక్కరు యీ ఆలోచన చేసే ఉంటారు. ఆ వెంటనే ఒక సందేహం పట్టుకుంటుంది. మన ఒక్కరితో యీ సమాజం మారుతుందా? మనం మరుతామన్నా పక్కన ఉన్నవారు మారనిస్తారా ? మన కొత్త పోకడ చూసి నవ్వుకుంటారేమో.... ఇలా ప్రయత్నం ప్రారంభం అవకముందే సవాలక్ష సందేహాలు చుట్టుముడుతుంటాయి. మన సందేహాలే కాదు. మన చుట్టూ ఉన్న పరిస్తితులను చూస్తె ఎవరికైనా అవే ప్రశ్నలు తలెత్తుతాయి. కానీ ఒక్కసారి చరిత్ర గమనాన్ని పరిశీలిస్తే అర్ధమవుతుంది. మన సందేహాలు అర్ధంలేనివని. సామ్రాజ్యవాదానికి మన పూర్వికులే చరమగీతం పాడారు. రాచరికం కూడా అంతం అయినట్లే. కొన్నిదేశాలలో ఇంకా దాని ఛాయలు కనిపిస్తున్నా కాలం చెల్లింది. ఇక యిప్పుడు మన కళ్ళముందు కనిపిస్తున్న ఈజిప్ట్, ట్యునీషియ, మద్య ప్రాచ్యం దేశాలే సజీవ సాక్ష్యం.... మార్పు సాధ్యమే, అనివార్యమే అని చెప్పడానికి. ఎన్నో ఏళ్ళుగా ఉన్న అసంతృప్తి ఒక్కసారిగా పెల్లుబుకింది. ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సహనం నశించింది. ప్రజలంతా ఒక్కటయ్యారు. వారి చైతన్యం ఒక చారిత్రిక సన్నివేశానికి దారి తీస్తోంది. తెలంగాణాలోను ప్రత్యెక రాష్ట్రం కోసం ఇలాంటి సన్నివేశమే కనిపిస్తోంది. సుదీర్గ సమరంలోను ప్రజలు అలసిపోకుండా పోరాటం సాగిస్తూనే ఉన్నారు. యీ పరిస్తితి చూసాకైనా మనలో మార్పు రాదా. ఎవరికోసమో ఎదురుచూడాల్సిన అవసరం ఉందా? పరిస్థితులను నిందించాల్సిన అవసరం ఉందా? ఎన్ని ఉదాహరణలు చెప్పినా ఆచరణ అంత తొందరగా జరగదు అన్నది వాస్తవం. కానీ ముందుగ మనలోని నెగటివ్ ఆలోచన తీరును మార్చుకోవలసిన అవసరం ఉంది. మనవంతుగా మార్పును ప్రారంబిస్తే అదే తొలి అడుగు కావచ్చు . రేపు మనమే నూతన సమాజానికి సంస్కర్తలం కావచ్చు. అంతగా మనపై మనకు నమ్మకం లేకపోతే... ఎవరి నాయకత్వానో నడిచి అవినీతిలేని సమాజాన్ని, అందరు కలలుగనే ప్రపంచాన్ని మన కళ్ళముందు నిర్మించుకోవచ్చు. కావలిసినధల్ల ఒక్కటే..... సంకల్పం. యింత చెప్పిన నేను మారతాన అంటే మారేందుకు ప్రయత్నిస్తాను అని చెబుతాను. ఎందుకంటె నేను ఈ వ్యాసం రాసుకున్నందుకయినా కట్టుబడి ఉండాలి కదా. నా ప్రయత్నం పలిస్తుందనే అనుకుంటాను.

Wednesday, February 2, 2011

కాలయాపనే కాంగ్రెస్ లక్ష్యం


తెలంగాణ రాష్ట్రం ప్రకటించినట్టే చేసి వెన్ను చూపిన కాంగ్రెస్... పార్టీల మధ్య చీలికలు వచ్చినయని చెప్పి కమిటి యేసింది. అది అయిపొంగానే అఖిలపక్షం అనుకుంట పొద్దుపుచ్చే ప్రయత్నం చేస్తున్నది. ఇదంతటితోటి వచ్చిన లాభం కానీ మార్పు కానీ ఏమి ఉండదని కాంగ్రెస్కు తెలుసు.... అయినా కాలం ఎల్లదీసే దోరనితోటి వ్యవహరించడంలో మతలబు వొక్కటే..... ఎలెక్షన్ దాక చూద్దాం. అంతదాకా మిగత పార్టీల పనిపడదాం టైముకు ఏదో ఒకటి చేద్దాంలే అనే చూస్తంది. మన చాతగాని చవట, దద్దమలు అమ్మగారు అనుకుంట ఇట్లానే చూస్తుంటారు. ప్రజల మనోభావాలతో ఆడుకుంటారు. అంతులేని ఆవేదనతో ఆత్మహత్యలు చేసుకున్నావారికి పట్టదు. ఇంకా రచ్చ బండ అనుకుంట వూర్లు తిరుగుతున్నారు. రొచ్చుబండ, రోకలిబండలు వద్దని ఆందోళన చేస్తున్నా దున్నపోతుమీద సినుకు పడ్డట్టే... పైనుంచి బెదిరిచ్చుడు. హైదరాబాద్ల పులిలాగా డిల్లిల పిల్లిలాగా మాట్లాడే వీళ్ళా మనల్ని ఉద్దరిచ్చే నాయకులు. ఇంకా తెలుగుదేసమోళ్ళు రాయలసీమ శాసనాలు చెల్లవంటూ వాళ్ళ సంకల్నే కూసుంటారు. గట్టిగ జై తెలంగాణ అననోల్లు కూడా తెలంగాణ కోసం పోరాడుతార. రాజీనామా చెయ్యమంటే కాంగ్రెస్ భూచి చూపెట్టి పొద్దు ఎల్లదీసే పిరికి పందేలు వీల్లతోటి ఏమైతది లండూకో బొండుకో టీఆర్ఎస్సే బండిని ముందుకు లాగాలే వాళ్ళ మీద జనాలు ఒత్తిడి పెంచితే... వాళ్ళు యుపియె మీద ఒత్తిడి పెంచుతారు. లేదంటే తెలంగాణ లేనట్టే

పోరాటం ఆరాటం

బంగారు భవిష్యత్ కోసం ప్రజల పోరాటం - రాజకీయ జీవితం కోసం నేతల ఆరాటం అదే నేటి తెలంగాణ ఉద్యమ సారాంశం. దినసరి కూలి అయిన మేధావి అయిన కోరుకునేది ప్రత్యేక రాష్ట్రమే. నల్ల దొరల నుంచి, ఆదిపత్య తీరునుంచి విముక్తే.టిఆర్ఎస్ అయిన టీడీపీ, కాంగ్రెస్ అయిన కోరుకునేది రాజకీయ భవిష్యతే