My friend

Wednesday, February 23, 2011

ఎటువైపు ఈ పయనం....?


తెలంగాణ పోరుకు నాలుగు దశాబ్దాలు దాటుతుంది. పదేళ్లుగా ఉదృతంగా సాగుతుంది. ఈవిడత ప్రత్యేక రాష్ట్రం ప్రకటన వరకు పోయి.... వెనక్కి వచ్చినం. కృష్ణ కమిటికి సంవత్సరం దాటింది. నివేదిక వచ్చి కూడా నెలలు దాటుతుంది. ఇంకా నాటకాలు సాగుతూనే ఉన్నాయి. వీటికి అంతం కోసం నాలుగు కోట్ల జనాలు ఎదురు చూస్తండ్రు. నలబై ఎనిమిది గంటల బందుకు పిలుపునిచ్చినా జనాలు మద్దతు ఇచ్చిండ్రు అంటే ఎంతటి ప్రగాడ కోరిక ఉందొ అర్థం అయితంది. ఓ దిక్కు విద్యార్థులు, లాయర్లు, ఉద్యోగులు పని పక్కకు పెట్టి పోరుబాట పట్టిండ్రు. అయినా.... 125 ఏండ్ల కాంగ్రేసుకు దున్నపోతు మీద వాన పడ్డట్లే ఉంది. అధిష్టానాన్ని మెడలు వంచలేక బిక్కచచ్చిన మన నాయకులు డిల్లీ నుంచి ఎట్లా ఆడిస్తే అట్లనే ఆడుతుండ్రు. సోనియమ్మకి మన బాధలు అర్థంకాక ఇట్లా చేస్తాంది అనుకోను. తెలిసినా తెల్వనట్లు ఏమి జరగనట్లు నటిస్తంది. వాళ్లకు కావాల్సింది..... ఎటొచ్చి రాష్ట్రంల మల్లీ గెలవాలి మన బలంతోని 2014 ఎన్నికల్ల గెలవాలే. ఆ రాహుల్ నో ఇంకోక్కరినో ప్రదానిని చేసుకోవాలె. గది చూడాలంటే..... గీ సమస్యను అంతవరకు సాగతీయాలే. ఇప్పటికే చిరంజీవిని కలుపుకుని చంద్రబాబుకు, జగన్ కు చెక్ పెట్టిన కాంగ్రెస్.... ఇప్పుడు తెలంగాణల పట్టుకోసం పాకులాడుతంది. ఇప్పుడు ఇలాగే రాష్ట్రము ఇస్తే క్రెడిట్ కేసీఆర్ కు పోతది. ఈ భయాన్ని ఆ పార్టి ఎంపీలే భాహాటంగా భయట పెట్టిండ్రు. ఇందుకే ఎంత గొడవ జరుగుతున్నా డిల్లికి సెగ తాకుతున్నా పట్టి పట్టనట్టు నటిస్తాండ్రు. రాష్ట్రంలో అగ్గిపుడుతున్నా చూసి చూడనట్టు చేస్తాండ్రు.

ఒక్కటి ఖాయం. ఇంత పోరాటం జరిగినంకా ఇంకా కలసి ఉండుడు కుదరని పని. ఇది అందరికి అర్థం అయింది. సీమంధ్ర నేతలు కూడా ఒప్పుకున్తండ్రు. మరి ఇక్కన్నే ఉంది ప్రమాదం. 2014 వరకు టీఆర్ఎస్ ను కలుపు కోవాలని కాంగ్రెస్ చూస్తాంది. ఒత్తిడి తీసుకు వస్తుంది. అటు సీమంద్ర నేతలు హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసేందుకు కుట్రలు చేస్తాండ్రు. ఇక్కడి జనం ఒప్పుకోరని తెలిసి వాళ్ళను అనుగతొక్కే ప్రయత్నం చేస్తాండ్రు. ఎలక్షన్ల వరకు ఎట్లనో ఒకట్ల కెసిఆర్ ను ఒప్పిచ్చి హైదరాబాద్ లేని తెలంగాణ ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు కనబడ్తుంది. ఇందులో భాగంగానే ఎంపీలతోని మాట్లాడిస్తండ్రు.... టీ ఆర్ ఎస్ ను కాంగ్రెస్ లో కలపాలనే ప్రతిపాదన చేయిస్తాండ్రు.
బిక్షం అడుక్కోవడం లేదు: తెలంగాణ ప్రజలు రాజ్యంగంల ఉన్న హక్కు ప్రకారమే ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతున్నారు. దాని వెనక ఉన్న కారణాలు కూడా అందరికి తెలుసు. కానీ కాంగ్రెస్ నాయకులు ఇతి సుతి లేని మాటలు మాట్లాడుతున్నారు. చంద్రశేకర్ పార్టీని కాంగ్రేస్స్ లో కలిపితే వెంటనే రాష్ట్రం వస్తుంది అని చెప్తుండ్రు. అది వాళ్ళంతట వాళ్ళు చెబుతున్నది కూడా కాదు. సోనియమ్మ చెప్పిస్తున్న మాటలే. పార్టీల విలీనానికి రాష్ట్రానికి సంబంధం లేదు. కానీ వారి ప్రయోజనాలు నెరవేరాలంటే, మల్లీ అధికారం రావాలంటే, రాహుల్ ప్రదాని కావాలంటే వాళ్ళు చెప్పింది జరగాలి. మూర్ఖుల ద్రుష్టిలో ప్రజలు భిక్షం అడుక్కుంటూ ఉన్నట్టు కనిపిస్తూ ఉండొచ్చు. కానీ ప్రజలు వారి జన్మ హక్కు కోసం పోరాడుతుండ్రు. పార్టీ అంటే కార్పోరేట్ కంపెనీ అనుకునే..... పార్టీలను కంపనీల్లాగా మార్చిన నిక్రుస్టులు అంతకన్నా ఎక్కువ ఆలోచించలేరు.


పరిస్తితి మారాలంటే తెలంగాణలోని నాయకులూ అంతా ఏకం కావాలి. దురదృష్టం ఏమిటంటే ప్రజలంతా ఎకమైండ్రు.... కానీ సొంత లాభం తప్ప మరో గోడు పట్టని నేతలు మాత్రం కలవడం లేదు.

ధన్యవాదాలు: ఉద్యమంలో లెక్కలేనన్ని లాఠి దెబ్బలు తింటున్న విద్యార్థులు, లాయర్లు, ఉద్యోగాన్ని లెక్క చేయకుండా సహాయ నిరాకరణ చేస్తున్న ఉద్యోగులు, కళాకారులు, ఉద్యమంలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.


ను

No comments: